Home Uncategorized నేడు పద్మనాభంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

నేడు పద్మనాభంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

విశాఖపట్నం(Padmanabham): పద్మనాభం మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ ఆవరణలో ఈ నెల 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పద్మనాభంలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వైభవం విశిష్టత అనే అంశంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే నిర్వాహక కమిటీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసారు.

Previous articleBike Insurance Expire అయితే Police Fine ఎంత? 2026లో ప్రతి Bike Owner తప్పక తెలుసుకోవాల్సిన విషయం
Next articleBest Term Insurance India 2026: భారతదేశంలో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది? పూర్తి తెలుగు గైడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here