Home Uncategorized War 2: ట్వీట్టర్ ను షేక్ చేస్తిన్న వార్ 2.. ఎన్టీఅర్ వెర్సెస్ రామ్ చరణ్..?

War 2: ట్వీట్టర్ ను షేక్ చేస్తిన్న వార్ 2.. ఎన్టీఅర్ వెర్సెస్ రామ్ చరణ్..?

1
0

war2: ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ అయిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజువల్ ని అవెంజర్స్ సినిమాలో కూడా చూడని వెస్ట్రన్ ఆడియన్స్ స్టన్ అయ్యారు. అలాంటి ఎన్టీఆర్ ని యష్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్ లో భాగం చెయ్యడానికి రెడీ అయ్యారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ‘వార్ 2’ (war2) సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే వార్త మే 20న అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. వార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న వార్ 2లో హృతిక్ vs ఎన్టీఆర్ ఫైట్ ని చూసే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది, దీనికి కారణం ఎన్టీఆర్ ఫాన్స్ కాకుండా మెగా ఫాన్స్ అవ్వడం విశేషం. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి పోటీగా, ఎన్టీఆర్ ప్లేస్ లో రామ్ చరణ్ ఉంటే బాగుంటుంది… రామ్ చరణ్ వార్ 2లో చేస్తే బాగుంటుంది అని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ముంబైలో ప్రముఖ సింగల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా రామ్ చరణ్ వార్ 2 సినిమాలో నటిస్తే హిందీ సినిమాకి సౌత్ లో మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది అని మాట్లాడడంతో మెగా ఫాన్స్, మనోజ్ దేశాయ్ స్పీచ్ ని మరింత వైరల్ చేస్తున్నారు.

వీరికి కౌంటర్ వేస్తూ నందమూరి ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తుండడంతో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాలో మన టాలివుడ్ హీరో ఉన్నాడు అని సంతోషించాల్సిన విషయాన్ని ఎంజాయ్ చెయ్యకుండా ఫాన్స్ గొడవలు పడుతున్నారు.

Previous articleIphone Song Lyrics – Ramabanam Songs Lyrics | Gopichand | Sriwass
Next articleAP DSC Notification 2023, Vacancies, Online Application

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here