Home Center Govt Schemes PM Kisan e-KYC 2026 ఎలా పూర్తి చేయాలి? మీ ఫోన్ లోనే ఇలా చేయండి.....

PM Kisan e-KYC 2026 ఎలా పూర్తి చేయాలి? మీ ఫోన్ లోనే ఇలా చేయండి.. 24వ విడత ₹2,000 ఎప్పుడు?

PM-KISAN e-KYC Guide

PM Kisan e-KYC: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద ప్రయోజనం పొందుతున్న రైతులకు e-KYC చాలా ముఖ్యమైన ప్రక్రియ. e-KYC పూర్తి చేయకపోతే అర్హత ఉన్నప్పటికీ తరవాత విడత రావాల్సిన డబ్బులు రాకపోవడం జరుగుతుంది. రైతులు తమ e-KYC statusతో పాటు Aadhaar linking, land seeding, payment status వంటి వివరాలను కూడా అధికారిక PM-KISAN portalలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం PM-KISAN పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి ₹6,000 చొప్పున మూడు విడతల్లో, ఒక్కోసారి ₹2,000 నేరుగా బ్యాంకు ఖాతాలో DBT ద్వారా జమ చేస్తున్నారు.

PM Kisan e-KYC 2026లో ఎలా చేసుకోవాలి?

రైతులు తమ ఆధార్ ఆధారంగా e-KYC పూర్తి చేయాలి. ప్రస్తుతం e-KYC కోసం ప్రధానంగా మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

  1. Aadhaar OTP ద్వారా e-KYC
  2. CSCలో Biometric e-KYC
  3. PM-KISAN Mobile App ద్వారా Face Authentication

అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌లో కూడా e-KYC mandatory అని స్పష్టంగా పేర్కొన్నారు.

మొబైల్‌లో PM Kisan e-KYC ఎలా చేయాలి?

Aadhaarకు mobile number link అయి ఉన్న రైతులు ఇంటి నుంచే OTP ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు.

ఇలా చేయండి:

Step 1: అధికారిక PM-KISAN websiteను తెరవండి.

Step 2: Farmers Cornerలో ఉన్న e-KYC optionను ఎంచుకోండి.

Step 3: మీ Aadhaar Number నమోదు చేయండి.

Step 4: Aadhaarకు link అయి ఉన్న mobile numberకు వచ్చిన OTPను నమోదు చేయండి.

Step 5: Verification పూర్తయిన తర్వాత e-KYC successful అయినట్లు statusలో కనిపిస్తుంది.

OTP రాకపోతే?

Aadhaarకు mobile number link కాకపోవడం, network సమస్య, Aadhaar వివరాల్లో తేడా వంటి కారణాల వల్ల OTP సమస్య రావచ్చు. అలాంటి సమయంలో రైతులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లలో biometric ద్వారా e-KYC చేయించుకోవచ్చు. మరో సులభమైన మార్గం PM-KISAN Mobile Appలో Face Authentication ఉపయోగించడం ద్వారా కూడా చేసుకోవచ్చు.

PM-KISAN Mobile App ద్వారా Face e-KYC ఎలా చేయాలి?

OTP సమస్య ఉన్న రైతులకు Face Authentication e-KYC ఉపయోగపడుతుంది. దీనివల్ల biometric device లేకుండానే మొబైల్ ద్వారా e-KYC పూర్తి చేసే అవకాశం ఉంది.

కావాల్సినవి

  • Android smartphone
  • PM-KISAN Mobile App
  • Aadhaar number
  • మొబైల్‌లో camera permission
  • అవసరమైన Face Authentication support

ప్రక్రియ ఇలా చేయండి(PM Kisan face Authentication)

1. Google Play Store నుంచి అధికారిక PM-KISAN Mobile Appను download చేయండి.

2. అవసరమైతే Aadhaar Face RD appను కూడా install చేయండి.

3. PM-KISAN appను open చేసి registered mobile numberతో login చేయండి.

4. Beneficiary statusలో మీ e-KYC statusను చూడండి.

5. e-KYC status పూర్తి కాలేదంటే e-KYC optionను select చేయండి.

6. Aadhaar number నమోదు చేసి face authenticationకు consent ఇవ్వండి.

7. మొబైల్ camera ద్వారా ముఖాన్ని scan చేయండి.

8. Face verification విజయవంతంగా పూర్తయిన తర్వాత e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

e-KYC పూర్తి చేసిన వెంటనే status మారకపోవచ్చు. అధికారిక మార్గదర్శకాల ప్రకారం e-KYC వివరాలు beneficiary statusలో అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు.

CSCలో PM Kisan e-KYC ఎలా చేయాలి?

మొబైల్‌లో OTP లేదా Face Authentication ద్వారా e-KYC చేయడం సాధ్యం కాకపోతే రైతులు సమీపంలోని Common Service Centre (CSC)ను సంప్రదించవచ్చు.

CSCలో biometric authentication ద్వారా e-KYC చేయవచ్చు.

CSCకి వెళ్లేటప్పుడు ఏమి తీసుకెళ్లాలి?

  • Aadhaar Card
  • Aadhaarకు link అయిన mobile number
  • PM-KISAN registration వివరాలు ఉంటే అవి
  • అవసరమైతే bank account వివరాలు

CSC operator PM-KISAN systemలో రైతు వివరాలను పరిశీలించి Aadhaar-based biometric verification ద్వారా e-KYC పూర్తి చేస్తారు.

“Mohith Digital Seva (CSC) – Padmanabham, అన్ని ఆన్లైన్ సేవలు అందించబడును. సంప్రదించండి 9493818177. (రైస్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ RC OTP లేకపోయినా డౌన్లోడ్ చేసి కార్డ్ ఇవ్వబడును)”

PM Kisan 24వ విడత ₹2,000 ఎప్పుడు వస్తుంది?

PM-KISAN పథకంలో సంవత్సరానికి మూడు విడతలుగా ₹2,000 చొప్పున మొత్తం ₹6,000 అందిస్తారు. ప్రస్తుతం 23వ విడత ₹2,000ను 2026 జూన్ 20న ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతులకు ₹18,880 కోట్లకు పైగా DBT ద్వారా జమ చేశారు. తదుపరి ఆగస్టు–నవంబర్ విడతకి సంబంధించి 24వ విడతను త్వరలో విడుదల చేయనున్నారు.

Previous articlezero balance Account (BSBD): మినిమం బ్యాలెన్స్ అవసరం లేని బ్యాంక్ ఖాతా.. ఎవరు తీసుకోవచ్చు? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
Next articleCSC Aadhaar UCL New Services 2026: చైల్డ్ ఆధార్, బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here